ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు

  • ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం
  • పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
  • మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి. సాయిప్రసాద్ సేవలను మరో ఆరు నెలల పాటు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక ప్రతిపాదనలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) ఆమోదించింది. ఈ పొడిగింపుతో ఆయన నవంబర్ 30 వరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన విధులను నిర్వర్తించనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని ఈ నిర్ణయం బలపరుస్తోంది.


రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలనా పరిస్థితులు, కీలక ప్రాజెక్టుల కొనసాగింపు దృష్ట్యా సాయిప్రసాద్ అనుభవం అత్యవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. బడ్జెట్ రూపకల్పన, అమరావతి నిర్మాణ పనుల వేగవంతం ఇతర సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ స్థాయిలో సమూల మార్పులు జరుగుతున్న తరుణంలో, అనుభవజ్ఞుడైన సీఎస్ మార్పు చెందడం పరిపాలనపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావించి ఈ పొడిగింపు కోరింది.

Sai Prasad
Andhra Pradesh
Chief Secretary
IAS officer
Chandrababu Naidu
AP Government
Civil Services
Government Extension
Amaravati
AP Budget

More Telugu News